వకీల్‌సాబ్‌ ‘టీజర్‌’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత నటించిన తొలి చిత్రం ‘వకీల్‌సాబ్’. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా అందరినీ అలరించేందుకు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో పవన్‌ లుక్‌ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ న్యాయవాదిగా పవన్ దర్శనమిచ్చాడు. అంతేకాకుండా ‘కోటు వేసుకొని వాదించడం తెలుసు. కోటు తీసి వాయించడం తెలుసు’ అని తనదైన తరహా డైలాగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా చేస్తుంది. ఈ టీజర్‌లో శ్రుతీ హాసన్ ఎక్కడా కనిపించిలేదు. టీజర్ చూస్తుంటే ఈ సినిమా అంచనాలను మించేటట్లు ఉన్నాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిందీ పింక్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కానీ తెలుగులో మాత్రం పవన్ పవర్‌కి తగ్గట్టుగా పాత్రలను డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది.

CLICK HERE!! For the aha Latest Updates