HomeTelugu Newsఅందుకే రాజేంద్రప్రసాద్‌కు క్షమాపణ చెబుతున్నా: వంశీ

అందుకే రాజేంద్రప్రసాద్‌కు క్షమాపణ చెబుతున్నా: వంశీ

12 10టీడీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తిప్పికొట్టారు. శనివారం సాయంత్రం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో వంశీ మట్లాడుతూ… గత రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ”చంద్రబాబు నాకు కోట్ల రూపాయలు ఇచ్చారని రాజేంద్రప్రసాద్‌ చెబుతున్నారు. నా వ్యక్తిగత అవసరాల కోసం డబ్బులు ఇచ్చారా? ఏ పార్టీ అయినా ఎన్నికల కోసం ఇవ్వడం సహజం. ఆ డబ్బులు ఎన్నికల్లోనే ఖర్చుపెట్టాం. ఓ ఛానల్‌లో డిబేట్‌లో పాల్గొన్నప్పుడు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ తొలుత నన్ను తిట్టారు. వంశీ డబ్బులు తీసుకున్నారనే సరికి కోపం వచ్చి అలా మాట్లాడాను. నేనేమైనా వెయ్యి కాళ్ల మండపం కూల్చానా? దుర్గగుడిలో క్షుద్రపూజలు చేశానా? టీటీడీ బోర్డు సభ్యుల పదవులు అమ్ముకున్నానా? ఏం తప్పు చేశాను? అయ్యప్ప మాల వేసుకుని అలా మాట్లాడావేంటని కొందరు అంటున్నారు. అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తిపై తొలుత అగౌరవంగా మాట్లాడింది ఎవరు? నేను తప్పు చేయలేదు. వయసులో పెద్దవాడు. నేను అయ్యప్పమాల ధరించి ఉన్నా కాబట్టి రాజేంద్రప్రసాద్‌కు క్షమాపణ చెబుతున్నా” అని వంశీ అన్నారు.

”ఇటీవల సీఎం జగన్‌ను కలిసినప్పుడు కేవలం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై మాత్రమే మాట్లాడాను. ఆయన సహకరిస్తానన్నారు. చంద్రబాబు కాళ్లు పట్టుకున్నానని రాజేంద్రప్రసాద్‌ చెబుతున్నారు. పెద్ద వాళ్లకు దండం పెట్టడం సంస్కారం. చంద్రబాబు నా తండ్రి లాంటి వారు. కాళ్లకు దండం పెడితే తప్పేంటి? దండం పెట్టడం వేరు.. కాళ్లు పట్టుకోవడం వేరు. సిగ్గుంటే వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని లోకేశ్‌ అంటున్నారు. అలాగే రాజీనామా చేస్తా. అన్నం సతీష్‌కుమార్‌ బాపట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడంతో ప్రజలు తిరస్కరించారని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. లోకేశ్‌ కూడా అలా ఎందుకు రాజీనామా చేయలేదు. లోకేశ్‌ ఎమ్మెల్సీగా ఉండాలి. నేను మాత్రం రాజీనామా చేయాలా? మీకో న్యాయం.. ఇతరులకు ఇంకో న్యాయమా?” అని వంశీ ప్రశ్నించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!