‘వానవిల్లు’ ట్రైలర్‌ విడుదల!

రాహుల్‌ ప్రేమ్‌ (ఆర్పీ) మూవీ మేకర్స్‌ పతాకంపై ప్రతీక్‌, శ్రావ్య, విశాఖ హీరో హీరోయిన్లుగా లంకా కరుణాకర్‌ దాస్‌ నిర్మాతగా ప్రతీక్‌ ప్రేమ్‌ కరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వానవిల్లు’. ఈ చిత్ర ట్రైలర్‌ని హైద్రాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో, దర్శకుడైన ప్రతీక్‌ మాట్లాడుతూ… ”నాకు సినిమా అంటే చాలా ఇష్టం. కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌ డైరెక్ట్‌ చేశాను. నాకున్న ఇంట్రెస్ట్‌, టాలెంట్‌ చూసి మానాన్న గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అంతేకాదు, నా మీద నమ్మకంతో ఈ మూవీని ప్రొడ్యూస్‌ కూడా చేశారు. ఈ సినిమాతో మా నాన్నగారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను.” అని అన్నారు.
కెమెరామెన్‌ ఎస్‌.డి. జాన్‌ మాట్లాడుతూ.. ”డైరెక్టర్‌, హీరో అయిన ప్రతీక్‌ వయసు 20 సంవత్సరాలుంటుంది. 20 సంవత్సరాల కుర్రాడు..ఇతనేం డైరెక్ట్‌ చేస్తాడని ముందు అనుకున్నా..కానీ..అతని డెడికేషన్‌కి, సినిమాపై అతనికున్న క్లారిటీకి ముగ్ధుడినయ్యాను” అన్నారు.
నిర్మాత లంకా కరుణాకర్‌ దాస్‌ మాట్లాడుతూ… ”మా అబ్బాయి ప్రతీక్‌ గురించి చెబితే కొంచెం అతిశయోక్తిగా ఉంటుంది. కానీ అతనికున్న టాలెంట్‌కి, ఫ్యాషన్‌ని చూసి..ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చాను. ఈ సినిమాని చాలా చక్కగా తెరకెక్కించాడు. కేరళ, మలేషియా, అరకు, హైద్రాబాద్‌ మొదలగు ప్రదేశాల్లో ఖర్చుకు వెనకాడకుండా..ఒక విజువల్‌ వండర్‌లాగా చిత్రాన్ని నిర్మించాము. ట్రైలర్‌ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము” అని అన్నారు.
సంగీత దర్శకుడు లంకా ప్రభు ప్రవీణ్‌, హీరో మదర్‌, జబర్ధస్త్‌ ఫణి మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates