చాలా రోజుల తరువాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి ఉంది: నాగ్‌

టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున, న్యాచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా తెరకెక్కుతున్న మల్టిస్టారర్‌ చిత్రం ‘దేవదాస్’‌. ఈ సినిమాలో దేవ పాత్రలో డాన్‌గా నాగార్జున, దాసు పాత్రలో డాక్టర్‌గా నాని నటిస్తోన్న ఈ మూవీపై అంచనాలు చాలానే ఉన్నాయి.

అయితే తాజాగా ‘దేవదాస్‌’ సినిమాలో నటిస్తున్న హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్‌ పాత్రను పరిచయం చేస్తూ నాగార్జున చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. చాలా రోజుల తరువాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి ఉందంటూ ట్వీట్‌ చేశాడు నాగార్జున. సోమవారం సాయంత్రం వీరిద్దరికి సంబంధించిన ఓ డ్యూయెట్‌ లిరికల్‌ సాంగ్‌ కూడా రిలీజ్‌ కానున్నట్లు ట్వీట్‌ చేశాడు నాగ్‌. ఆదిత్య శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయనున్నారు. అయితే ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, పోస్టర్స్‌, లిరికల్‌ సాంగ్స్‌ వైరల్‌ అవుతున్నాయి.