రాజకీయాల్లోకి వర్మ హీరోయిన్‌!

సినీరంగంలో రాణించిన స్టార్స్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఒక్కొక్కరిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి వర్మ హీరోయిన్ కూడా చేరిపోతున్నట్టు తెలుస్తోంది. 20 సంవత్సరాల క్రితం వర్మ తెరకెక్కించిన రంగీలా సినిమాలో ఊర్మిళ హీరోయిన్. ఈ సినిమాతో ఊర్మిళ దేశవ్యాప్తంగా పాపులర్ అయింది.

రంగీలా తరువాత వరసగా సినిమాలు చేసి పాపులరైన ఊర్మిళ… ఇప్పుడు దాదాపుగా సినిమాలు దూరంగా ఉంటున్నది. ఈ రంగీలా స్టార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీతో ఊర్మిళ టచ్ లో ఉంటున్నదట. ముంబై ఉత్తరం పార్లమెంట్ నియోజక వర్గం నుంచి ఊర్మిళ పోటీ చేస్తారని సమాచారం. ఈ నియోజక వర్గం నుంచి గతంలో సునీల్ దత్ ఐదు సార్లు పార్లమెంట్ కు ఎంపికయ్యారు. సినీ గ్లామర్ ను అక్కున చేర్చుకోవడంలో ఈ పార్లమెంట్ నియోజక వర్గం ముందుండటంతో ఊర్మిళ పోటీ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.