వర్మ సారీ చెప్పాడు!

వర్మ సారీ చెప్పాడు!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. 
అసలు ఎవరికి లొంగని వర్మ ఊహించని విధంగా సారీ చెప్పాడు. ఇంతకీ ఆ సారీ ఎవరికి చెప్పారో
తెలుసా.. గతంలో మెగాహీరోలను టార్గెట్ చేస్తూ.. వర్మ ట్విటర్ లో చాలా కామెంట్స్ చేశారు. ఆ 
సమయంలో మెగాభిమానులు వర్మకు రివర్స్ అయినా.. పట్టించుకోలేదు. ఇప్పుడు నన్ను క్షమించండి అంటూ అభిమానులను కోరాడు. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సంధర్భంగా చిరు 150 వ సినిమా’ఖైదీ నెంబర్ 150′ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ను తన ట్విటర్ లో పోస్ట్ చేసిన వర్మ ”మెగాస్టార్ లుక్ అమేజింగ్ గా ఉంది.. లుక్ చూస్తుంటే కచ్చితంగా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అనిపిస్తోంది. మెగాస్టార్ కెరీర్ లో ఇదే బెస్ట్ లుక్. ఖైదీ నెంబర్ 150 సూపర్ క్లాసీ, ఇంటెన్స్ లుక్. ఈ లుక్ చూసిన తరువాత గతంలో నేను చేసిన కామెంట్స్ విషయంలో మెగాభిమానులను క్షమాపనలు కోరుతున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. 
CLICK HERE!! For the aha Latest Updates