HomeTelugu Trendingబిగ్‌ బాస్‌ షోపై భానుశ్రీ సంచలన వ్యాఖ్యలు

బిగ్‌ బాస్‌ షోపై భానుశ్రీ సంచలన వ్యాఖ్యలు

Varudu fame Bhanu Sri Mehta
టాలీవుడ్‌లో వరుడు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది భాను శ్రీ మెహ్రా. వరుడు తరువాత భాను శ్రీకి తెలుగులో ఎక్కువగా అవకాశాలు రాలేదు. చిన్నా చితకా చిత్రాలు చేసినా హిట్టు కాలేదు. అలా కొంత కాలానికి భాను శ్రీ టాలీవుడ్‌కు దూరం అయింది. ఈ మధ్యే భాను శ్రీ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించసాగింది. ఆ మధ్య బన్నీ తనను ట్విట్టర్‌లో బ్లాక్ చేశాడంటూ నానా రచ్చ చేసింది.

ఆ తరువాత బన్నీ మళ్లీ అన్ బ్లాక్ చేశాడు. అలా ఒక్క రోజుల్లోనే వివాదం తారాస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్న భాను శ్రీకి తెలుగులో ఏదైనా సినిమా చేయాలని ఆశగా ఉందట. ఎవరైనా సంప్రదిస్తే బాగుండన్నట్టుగా ఆ మధ్య ట్వీట్ కూడా వేసింది. మళ్లీ ఇప్పుడు భాను శ్రీ బిగ్ బాస్ షో మీద కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చింది.

బిగ్ బాస్ లాంటి షోను జనాలు అసలు ఎలా చూస్తారో నాకు అర్థం కాదు.. జనాలను చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది.. ఇంకా కొత్త సీజన్లు వస్తూనే ఉన్నాయి.. నా దృష్టిలో టీవీలో వచ్చే షోలన్నింటిలో ఇదొక్కటే మైండ్ లెస్, చెత్త షో. బిగ్ బాస్ షోకు సంబంధించిన చెత్త అంతా నా ఇన్ స్టాగ్రాం ఖాతాలోనే కనిపిస్తోందంటూ వాపోయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!