‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్లు

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ మూవీలో మరో ఇద్దరు స్టార్లు సందడి చేయనున్నారట. ఇప్పటికే బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అజయ్‌ దేవగణ్‌ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాగా బాలీవుడ్ నటులు వరుణ్‌ ధావన్‌, సంజయ్‌ దత్‌ను ఈ చిత్రంలోని కీలక పాత్రలకు దర్శక, నిర్మాతలు సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నటిస్తామని వారు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ లో హీరోలుగా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమరం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. ఆలియాతోపాటు హాలీవుడ్‌ నటి డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ మరో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దానయ్య నిర్మాత. వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అన్నీ భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates