సింగర్‌గా మారబోతున్న పూజాహేగ్డే

పూజా హేగ్డే టాలీవుడ్‌లో ముకుందా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ డీజే సినిమా తరువాత వరస పెద్ద సినిమాలు చేయడం మొదలుపెట్టింది. ఎన్టీఆర్ అరవింద సమేత సూపర్ హిట్ కావడంతో.. నమ్మకం పెరిగింది. ఆ తరువాత మహర్షి చేసింది. ఈ సినిమా కూడా బంపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ప్రభాస్ తో జాన్, అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నది.

అరవింద సమేత సినిమాలో పూజానే సొంతంగా వాయిస్ చెప్పుకుంది. తన వాయిస్ హస్కిగా ఉండటంతో అల్లు అర్జున్ సినిమాలో సాంగ్ పాడేందుకు సిద్ధం అయ్యింది. పూజా సాంగ్ పాడలనే కోరికను తెలుసుకున్న త్రివిక్రమ్.. థమన్ చేత ఓ స్పెషల్ సాంగ్ చేయించినట్టు సమాచారం. మరి ఈ సాంగ్ డ్యూయెట్ లా ఉంటుందా లేదంటే సోలో సాంగ్ లా ఉంటుందా చూడాలి.