HomeTelugu Trendingఎఫ్‌3కి వెంకీ, వరుణ్‌ల భారీ రెమ్యూనరేషన్‌

ఎఫ్‌3కి వెంకీ, వరుణ్‌ల భారీ రెమ్యూనరేషన్‌

Varun tej and venkatesh dem
టాలీవుడ్‌ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘నారప్ప’ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే నారప్పను త్వరగా ముగించుకుని అనిల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎఫ్3’ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ రెండో హీరోగా చేయనున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే మొదటగా ఈ సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులను సంపాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ తీసేందుకు అనిల్ రావిపుడి సిద్దమయ్యాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎఫ్3 స్ర్కిప్ట్‌ను సిద్దం చేశారు.

ఈ సీక్వెల్‌ను కూడా దిల్ రాజు తీసేందుకు ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా హీరోలు, దర్శకుడి వద్ద నుంచి డిమాండ్‌లు భారీగా వస్తున్నాయని నిర్మాత అన్నారు. దిల్ రాజ్ ఎఫ్2ను డీసెంట్ బడ్జెట్‌తో ముగించారు. ఎఫ్3కి మాత్రం హీరోలు వరుణ్‌ తేజ్‌, వెంకీ, దర్శకుడు అనిల్ పారితోషికం భారీగా అడుగుతున్నాడట. ఈ మూవీ కోసం వరుణ్‌ రూ. 12 కోట్లు, వెంకీ రూ. 13 కోట్లను డిమాండ్‌ చేశారట. ఇక డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి సైతం తన రెమ్మూనరేషన్‌ పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక వారి డిమాండ్లకు నిర్మాత దిల్‌ రాజ్‌ కూడా అంగీకరించాడని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu