తెలుగు విద్యార్థుల అరెస్ట్‌ బాధ కలిగించింది: పవన్ కల్యాణ్

అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌ అధికారుల అదుపులో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన న్యాయ సహాయం అందించి విడుదల చేయించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలను తక్షణమే తీసుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ కోరారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ ఆ దేశానికి ఎంఎస్‌ చదివేందుకు వెళ్లి కేసుల్లో చిక్కుకోవడంతో వారి తల్లిదండ్రులు ఎంతో ఆందోళనలో ఉన్నారని చెప్పారు. అరెస్ట్ అయినవారిలో ఎక్కువమంది తెలుగువారు ఉన్నారనే వార్తలు బాధను కలిగిస్తున్నాయని పవన్ అన్నారు.

అమెరికా ప్రభుత్వమే మిషిగన్ రాష్ట్రంలో నకిలీ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసి ట్రాప్ చేసి చేరిన విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం విచారకరమని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇబ్బందులుపడుతున్న విద్యార్థులకు అవసరమైన సాయాన్ని అందించాలని ఎన్నారై జనసేన ప్రతినిధులను ఆయన విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కళాశాల దశ నుంచే అవగాహన శిబిరాలను నిర్వహించాల్సిన బాధ్యతను విద్యా శాఖతోపాటు కళాశాలలు తీసుకోవాలన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates