Matka OTT release date:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన హీరో వరుణ్ తేజ్, ప్రస్తుతం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న వరుణ్ తాజాగా నటించిన చిత్రం ‘మట్కా’ కూడా థియేటర్లలో భారీ ఫ్లాప్ అయ్యింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.
క్రిటిక్స్ నుండి ఎక్కువగా నెగటివ్ రివ్యూలు రావడంతో, ‘మట్కా’ తక్కువ కాలంలోనే థియేటర్ల నుంచి తప్పుకుంది. అయినప్పటికీ, ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికపై అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. డిసెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ప్రసారమవుతోంది. ఈ OTT వేదికపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
#Matka (Telugu) Expected Streaming from December 5th on @PrimeVideoIN#OTT_Trackers pic.twitter.com/lGcDNoLoMB
— OTT Trackers (@OTT_Trackers) November 30, 2024
1958-1982 కాలంలో విశాఖపట్నం నేపథ్యంలో సాగే ఈ చిత్రం, బర్మాలో శరణార్థిగా వచ్చిన వాసు అనే యువకుడి జీవితం.. పేదరికం నుండి కోటీశ్వరుడిగా మారిన అతని కథ ఆధారంగా సినిమా కథ ఉంటుంది. బాలీవుడ్ గ్లామర్ క్వీన్ నోరా ఫతేహి సినిమాలో కీలక పాత్ర పోషించారు.
రాజిని తల్లూరి, డా. విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సహకారం అందించాయి. Matka OTT రెస్పాన్స్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.