HomeTelugu TrendingA.R. Rahman సైరా బాను విడాకులలో కొత్త ట్విస్ట్!

A.R. Rahman సైరా బాను విడాకులలో కొత్త ట్విస్ట్!

Latest twist in A.R. Rahman and Saira Banu’s Divorce
Latest twist in A.R. Rahman and Saira Banu’s Divorce

Twist in A.R. Rahman Divorce:

ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్, సైరా బాను విడాకుల ప్రకటన వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. 1995లో వివాహం చేసుకున్న ఈ జంట, 29 సంవత్సరాల పాటు కలిసి జీవనం గడిపారు. వారి విడాకుల ప్రకటనలో వ్యక్తిగత బాధలు, దూరం విడాకులకు కారణం అని అన్నారు.

సైరా బాను ఈ విషయం పై స్పందిస్తూ, రూమర్స్ ప్రచారం చేయద్దు అని ప్రజలను కోరారు. నవంబర్ 24న ఆమె విడుదల చేసిన ఆడియో క్లిప్‌లో, తాను ప్రస్తుతం ముంబైలో ఆరోగ్య సమస్యల చికిత్స కోసం ఉన్నానని, చికిత్స పూర్తైన తర్వాత చెన్నైకి తిరిగి వెళ్తానని తెలిపారు. అయితే, వారి విడాకుల ప్రకటన పట్ల పలు వాదనలు అభిప్రాయాలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి.

విడాకుల ప్రకటన తరువాత, వారి అడ్వకేట్ వందన షా మాట్లాడుతూ, పిల్లల కస్టడీపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. వారి కొందరు పిల్లలు పెద్దవారు కావడంతో, తమకు నచ్చిన తల్లిదండ్రుల వద్ద ఉండే స్వేచ్ఛ ఉందని అన్నారు. ఆలిమనీపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, అయితే సైరా డబ్బు విషయంలో ఆసక్తి చూపించని వ్యక్తి అని పేర్కొన్నారు.

మరోవైపు, మళ్ళీ వీరు అవకాశం ఉందా అనే ప్రశ్నకు వందన షా స్పందిస్తూ, విడాకుల ప్రకటనలో ప్రధానంగా బాధ, దూరం వంటి అంశాలు ఉన్నాయని చెప్పారు. దీని ఆధారంగా, వారు ఒకరితో ఒకరు చర్చించుకుంటే తప్ప మళ్లీ కలుసుకునే అవకాశం గురించి చెప్పలేమని అన్నారు.

ALSO READ: UV క్రియేషన్స్ నుంచి తప్పుకున్న Mega Hero సినిమా.. నెక్స్ట్ ఏంటి?

Recent Articles English

Gallery

Recent Articles Telugu