స్పీడ్ మీదున్న మెగాహీరో!

venky‘మిస్టర్’ సినిమాతో పరాజయం పొందిన వరుణ్ తేజ్ ఆ ఫ్లాప్ తో కాస్త డీలా పడ్డాడు. అయితే తొందరగానే తేరుకొని ‘ఫిదా’తో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. నటన పరంగా కూడా వరుణ్ కి మంచి మార్కులు పాదాయి. ఈ ఉత్సాహంతో ఆయన తన తదుపరి సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తదుపరి సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

త్వరలోనే మరో షెడ్యూల్ కు రెడీ అవుతోంది. జులై నెలాఖరులోనే మొదటి షెడ్యూల్ ను ఆరంభించి పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వరుణ్ సరసన రాశిఖన్నా నటిస్తుండగా, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో కూడుకున్న ఈ సినిమా తన కెరీర్ కు హెల్ప్ అవుతుందని వరుణ్ భావిస్తున్నాడు.