HomeTelugu Reviews'వీరసింహా రెడ్డి' మూవీ రివ్యూ

‘వీరసింహా రెడ్డి’ మూవీ రివ్యూ

veera simha reddy movie rev
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం వీరసింహా రెడ్డి ‘వీరసింహా రెడ్డి’. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఈ సినిమా నేడు (జనవరి12)న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ : ‘పులిచర్ల’లో వీరసింహారెడ్డి (బాలకృష్ణ)ని అక్కడి ప్రజలు దేవుడిలా భావిస్తుంటారు. అక్కడ ఆయన చెప్పిందే వేదం .. ఆయన ఆదేశమే శాసనం. అయితే వీరసింహారెడ్డి ఆధిపత్యాన్ని ప్రతాప రెడ్డి (దునియా విజయ్) సహించలేకపోతుంటాడు. అదను దొరికితే వీరసింహారెడ్డిని అంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. తన తండ్రి చావుకి వీరసింహారెడ్డి కారకుడు కావడమే ప్రతాపరెడ్డి పగకు కారణం.

 

అయితే ఎప్పటికప్పుడు వీరసింహారెడ్డి చేతిలో తన్నులు తిని ప్రతాప్ రెడ్డి తోకముడుస్తూ ఉంటాడు. ఆయన భార్య ఎవరో కాదు .. వీరసింహా రెడ్డి చెల్లెలు భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్). తన అన్నను చంపేసి రమ్మని ఆమె తన భర్తను రెచ్చగొట్టి మరీ అతనిపైకి పంపిస్తూ ఉంటుంది. అతని ‘తల’ తెచ్చిన రోజునే తనకి మనఃశాంతి అని చెబుతూ ఉంటుంది. దాంతో అతను మరింత మందిని కూడగట్టుకుని వీరసింహారెడ్డిని అంతం చేయడానికి ప్రయత్నిస్తాడు.

veera simha 2

ఇక ‘ఇస్తాంబుల్’ లో మీనాక్షి(హానీ రోజ్) ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉంటుంది. ఆమె కొడుకే జైసింహా రెడ్డి( బాలయ్య). బిజినెస్ విషయంలో తల్లికి సహకరిస్తూ .. ఈషా (శ్రుతి హాసన్)తో ప్రేమలో పడతాడు. తమ ప్రేమ విషయాన్ని తన తండ్రి జయరామ్ (మురళి శర్మ)తో ఈషా చెబుతుంది. సంబంధం మాట్లాడుకోవడానికి ఆ తల్లీ కొడుకులు ఈషా ఇంటికి వెళ్లవలసిన సందర్భంలో, జై సింహారెడ్డితో అతని తండ్రి వీరసింహారెడ్డి అని మీనాక్షి చెబుతుంది. జై సింహారెడ్డి నిశ్చితార్థానికి అతని తండ్రిని ఇస్తాంబుల్ కి పిలిపిస్తానని అంటుంది.

వీరసింహారెడ్డి పులిచర్లలో ఉంటే మీనాక్షి ఎందుకు ‘ఇస్తాంబుల్’ లో ఉంటోంది. తన కొడుక్కి పెళ్లీడు వచ్చేవరకూ తండ్రి గురించి ఎందుకు చెప్పలేదు? వీరసింహారెడ్డి చెల్లెలు అతని శత్రువైన ప్రతాప్ రెడ్డిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి? అన్నయ్యపై ఆమె పగతో రగిలిపోయేంతగా ఏం జరిగింది? తన కొడుకు నిశ్చితార్థానికి ఇస్తాంబుల్ వెళ్లిన వీరసింహారెడ్డికి అక్కడ ఎలాటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేవి కథలో కనిపించే ఆసక్తికరమైన అంశాలు.

విశ్లేషణ: గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో మాస్ యాక్షన్ కథలపై ఈ సినిమా తెరకెక్కింది. కథ మొదటి నుంచి చివరి వరకూ కూడా తరువాత ఏం జరగనుందనే ఉత్కంఠను రేకెత్తిస్తూ వెళ్లాడు. ఇంటర్వెల్ సమయానికే సినిమా మొత్తం చూసేసిన ఫీలింగ్ వస్తుంది. ఇక ఆ తరువాత చూపించడానికి ఏముంటుంది? అనే సందేహాం ఆడియన్స్ లో తలెత్తుతుంది.

కానీ వీరసింహా రెడ్డితో ముడిపడిన వరలక్ష్మి శరత్ కుమార్ ఫ్లాష్ బ్యాక్, దునియా విజయ్ ఫ్లాష్ బ్యాక్ సెకండాఫ్ పై ఆసక్తిని కలిగిస్తాయి.. ఎక్కడా తగ్గకుండా కథ అంచలంచెలుగా పైమెట్టుకు చేరుకుంటూ ఉంటుంది. కథ .. కథనం .. ట్విస్టులతో ప్రేక్షకులు ఆకట్లుకున్నాడు దర్శకుడు. పాత్రలను మలిచిన తీరు కూడా బాగుంది.

veera simha 1

బాలకృష్ణ ఈ సినిమాలో మరోసారి తన నట విశ్వరూపాని చూపించారు. శృతిహాస పాత్ర పెద్దగా పండలేదు. దునియా విజయ్ .. వరలక్ష్మి శరత్ కుమార్ నటన ఈ సినిమాకి హైలైట్. బలమైన కథాకథనాలతో ముందుకు వెళుతున్న ఈ సినిమాకి తమన్ బాణీలు మరింత ఊతాన్ని ఇచ్చాయని చెప్పచ్చు. ప్రతి పాటా మాస్ ఆడియన్స్ ను ఊపేస్తుంది. ఒక రకంగా ఆయన ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడనే అనాలి. రామ్ లక్ష్మణ్ .. వెంకట్ ఫైట్స్ హైలైట్. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ ఆడియన్స్ తో క్లాప్స్ కొట్టిస్తాయి.

టైటిల్‌ : వీరసింహారెడ్డి
నటీనటులు :బాలకృష్ణ, శృతి హాసన్‌, దునియా విజయ్, వరలక్ష్మి శరత్, మురళీ శర్మ తదితరులు
నిర్మాతలు: వై.రవిశంకర్-నవీన్ ఎర్నేని
దర్శకత్వం: గోపీచంద్ మలినేని
సంగీతం: తమన్

హైలైట్స్‌‌: బాలకృష్ణ నటన, డైలాగ్స్‌
డ్రాబ్యాక్స్‌: రొటీన్‌ కథ

చివరిగా: బాలకృష్ణ ఫ్యాన్స్‌కి పండుగలాంటి సినిమా
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu