థ్రిల్లర్ కథలో శర్వానంద్..?

ఆహానా పెళ్ళంట, పూలరంగడు వంటి చిత్రాలతో దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించుకున్న దర్శకుడు వీరభద్రం. ఆ తరువాత ఆయన తెరకెక్కించిన ‘బాయ్’ తో పెద్ద షాక్ తగిలింది. ఇటీవల ఆయన డైరెక్ట్ చేసిన ‘చుట్టాలబ్బాయ్’ సినిమా కూడా ఫ్లాప్ టాక్ నే తెచ్చుకుంది. ప్రస్తుతం ఆయన ఓ కథను సిద్ధం చేసుకొని కల్యాణ్ రామ్, సాయి ధరం తేజ్ లకు వినిపించగా.. వారు వెనకడుగు వేయడంతో శర్వానంద్ ను కలిశాడు.

గతంలో శర్వా, వీరభద్రంతో కలిసి ఓ సినిమా చేయాలనుకున్నాడట. ఇప్పుడు ఆయన చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న శర్వా ఈ సినిమా కోసం కాల్షీట్స్ ఎప్పుడు ఇస్తాడో తెలియడంలేదు. కానీ ఎట్టిపరిస్థితుల్లో వచ్చే ఏడాది మార్చిలో సినిమాను మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. వీరభద్రం తన రెగ్యులర్ కామెడీ, యాక్షన్ ను వదిలిపెట్టి ఈసారి ఓ థ్రిల్లర్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.