Homeతెలుగు వెర్షన్వెలగపల్లి వరప్రసాదరావు రాజకీయ గ్రాఫ్ ?, వచ్చే ఎన్నికల్లో ఆయన పరిస్థితి ఇదే

వెలగపల్లి వరప్రసాదరావు రాజకీయ గ్రాఫ్ ?, వచ్చే ఎన్నికల్లో ఆయన పరిస్థితి ఇదే

Velagapalli Varaprasada Raos political graph this is his situation in the next ele
ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. వెలగపల్లి వరప్రసాదరావు.  ప్రస్తుతం ప్రజల్లో వెలగపల్లి వరప్రసాదరావు పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. ఉమ్మడి కృష్ణా జిల్లా మండవల్లి మండలం పసలపూడి గ్రామ పరిధిలో ఉన్న కొమ్మలమూడి గ్రామంలో దళిత కుటుంబంలో వెలగపల్లి వరప్రసాదరావు జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి బయో కెమిస్ట్రీ లో పి.హెచ్.డి పూర్తి చేశారు. వరప్రసాదరావు రాజకీయాల్లో రాకముందు కెమిస్ట్ గా, బ్యాంక్ ఉద్యోగిగా, ఆర్బిఐ అధికారిగా పని చేసి 1983 లో సివిల్స్ సాధించి తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ అధికారిగా వివిధ విభాగాల్లో పనిచేసి విఆర్ ఎస్ తీసుకున్నారు.
 
వెలగపల్లి వరప్రసాదరావు కుటుంబ నేపథ్యంలోకి వెళితే తండ్రి చిరంజీవులు టీచర్ గా మొదలై రాజకీయాల్లో అడుగుపెట్టి పసలపూడి గ్రామ సర్పంచ్ గా, మండవల్లి జెడ్పీటీసీ గా పనిచేశారు. వరప్రసాదరావు ప్రజారాజ్యం పార్టీ తరపున రాజకీయాల్లో అడుగుపెట్టి 2009 లోక్ సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకొని 2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2019 లో గూడూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 
 
మరి,  రాజకీయ నాయకుడిగా వెలగపల్లి వరప్రసాదరావు గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో వెలగపల్లి వరప్రసాదరావు పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో వెలగపల్లి వరప్రసాదరావు పరిస్థితేంటి ?, మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ వెలగపల్లి వరప్రసాదరావు కి ఉందా ?, చూద్దాం రండి. వెలగపల్లి వరప్రసాదరావు పై వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వెలగపల్లి వరప్రసాదరావు కేవలం వాణిజ్య ధోరణితోనే తన రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారని ప్రజల్లో విస్తృతమైన ప్రచారం కూడా ఉంది.  దీనికితోడు వెలగపల్లి వరప్రసాదరావుకి కోపం ఎక్కువ అని, కిందిస్థాయి నాయకులతో ఆయన చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారని అంటున్నారు.  

అసలు వెలగపల్లి వరప్రసాదరావు ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పటికీ..  ఇప్పటికీ ఐఏఎస్ అధికారి లాగే వ్యవహరిస్తూ ఉంటారు అని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు మరియు కార్యకర్తలు అంటున్నారు. ఐతే, తన పై ఉన్న ఈ గుసగుసలను వెలగపల్లి వరప్రసాదరావు  ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రాజకీయంగా వివాదరహితుడిగా తన ఇమేజ్ ను కాపాడుకుంటూ  వస్తున్నప్పటికీ… అవినీతి విషయంలో మాత్రం వెలగపల్లి వరప్రసాదరావు  విచ్చలవిడిగా ముందుకు వెళ్తున్నారు.  మొత్తంగా తనను గెలిపించిన ప్రజలకు వెలగపల్లి వరప్రసాదరావు  తనేం చేయలేకపోయాడు.  కాబట్టి..  వచ్చే ఎన్నికల్లో వెలగపల్లి వరప్రసాదరావు ఎట్టిపరిస్థితిలో గెలవడు. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu