HomeTelugu Trendingపేకాట‌తో బిజీగా ఉన్న వెంకీ-మహేష్‌

పేకాట‌తో బిజీగా ఉన్న వెంకీ-మహేష్‌

venkatesh and mahesh babu p

శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్షన్‌లో వచ్చిన ‘సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’ సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. మాన‌వ సంబంధాలు భావోద్వేగాల నేప‌థ్యంలో ర‌క్తి క‌ట్టించిన చిత్ర‌మిది. గోదారి జిల్లా యాస నేటివిటీ ట‌చ్ తో ఆక‌ట్టుకుంటుంది. ఇందులో పెద్దోడుగా విక్ట‌రీ వెంక‌టేష్, చిన్నోడిగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించ‌గా, వారికి త‌ల్లిదండ్రులుగా విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ న‌టించారు.

ఆ సినిమాలో అన్న‌ద‌మ్ములుగా వెంకటేష్‌, మ‌హేష్ బాబు మ‌ధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వ‌ర్క‌వుటైంది. చిన్నోడా పెద్దోడా అంటూ ఆ ఇద్ద‌రికీ మ‌ధ్య అన్న‌ద‌మ్ముల బంధాన్ని ఎంతో అందంగా హృద్యంగా ఆవిష్క‌రించాడు ద‌ర్శ‌కుడు. తాజాగా వెంకీ-మహేష్‌ క‌లిసిన‌ట్టే క‌నిపిస్తోంది. క‌ల‌వ‌డ‌మే కాదు.. ఇద్ద‌రూ ఓచోట కూచుని ముక్కేసుకున్నారు. పేకాట‌లో త‌ల‌మున‌క‌లుగా క‌నిపిస్తున్నారు. అంతేకాదు.. బెట్టింగ్ కూడా పెద్ద రేంజులోనే న‌డుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అక్క‌డ డబ్బులు ఈ విష‌యాన్ని చెబుతున్నాయి.

187997 image

అయితే మ‌హేష్- వెంకీ క్లబ్ హౌస్ ప్రారంభోత్సవం కోసం వెళ్లి కాసేపు స‌ర‌దాగా ఇలా ఆటలో మునిగార‌ని తెలుస్తుంది. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చెందిన క్ల‌బ్ హౌస్ ప్రారంభోత్స‌వానికి హాజ‌రై అనంత‌రం, ఇంట్లో జరిగిన కార్యక్రమానికి ఆ ఇద్ద‌రూ హాజరయ్యారని ఊహాగానాలు సాగుతున్నాయి. లీక్ అయిన ఫోటో ఎక్క‌డినుంచి అన్న‌ది ఇంకా తెలియరాలేదు. కానీ ఈ ఫోటోలు మాత్రం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!