HomeTelugu Trendingఆ సినిమాకోసం వెంకటేష్‌కు భారీ పారితోషకం.?

ఆ సినిమాకోసం వెంకటేష్‌కు భారీ పారితోషకం.?

8 5
టాలీవుడ్‌ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేశ్ తనదైన స్టైల్లో కెరియర్ ను ముందుకు తీసుకెళుతున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ, మల్టీ స్టారర్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన పాత్రకి అధిక ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ, సక్సెస్‌తో ఎక్కువ భాగం తన ఖాతాలో జమ చేసుకుంటున్నాడు.

ఈ తరహాలో ఆయన చేసిన ‘ఎఫ్ 2’ భారీ విజయాన్ని సాధించింది. వసూళ్లపరంగా కూడా కొత్త రికార్డులను సృష్టించింది. దాంతో డైరెక్టర్‌ అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’కి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా కోసం వెంకటేశ్ కి గతంలో కంటే ఎక్కువ పారితోషికం ఇవ్వాలా? లాభాల్లో వాటా ఇవ్వాలా? అనే విషయంలో ‘దిల్’ రాజు తన నిర్ణయాన్ని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడిందట. దాంతో ఆయన ఆలోచనలో పడినట్టుగా ఫిల్మ్ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎలా చేసినా వెంకటేశ్ కి భారీ మొత్తమే ముట్టనుందని వినికిడి. ఈ విషయంపై ఒక క్లారీటీ వస్తే ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లనుంది అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu