వెంకీ సినిమా క్రిష్ తోనా..? పూరీతోనా..?

విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న ‘గురు’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా నిర్విరామంగా షూటింగ్ నిర్వహించి అతి తక్కువ కాలంలో చిత్రీకరణ పూర్తి చేసేశారు. సుధా కొంగర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా జనవరి 26న రిపబ్లిక్ డే సంధర్భంగా విడుదల కానుందని సమాచారం. అయితే ఈ సినిమా తరువాత వెంకీ, నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాకు ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ అనే టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేశారు. నిత్యమీనన్ హీరోయిన్.
తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమా క్యాన్సిల్ అయిందనే టాక్ వినిపిస్తోంది. కిషోర్ చెప్పిన లైన్ వెంకీకు బాగా నచ్చిందట. అయితే పూర్తి కథ సిద్ధం చేసిన తరువాత వెంకీ కొన్ని మార్పులు చెప్పినట్లు తెలుస్తోంది. మార్పులు చేసినప్పటికీ కథతో వెంకీ సాటిస్ఫై అవ్వలేదని సమాచారం. దీంతో ప్రాజెక్ట్ మొదలవ్వక ముందే ఆగిపోయినట్లు వెంకీ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. తన లైన్ తో వెంకీను ఇంప్రెస్ చేసిన కిషోర్ తిరుమల కథతో మెప్పించలేకపోయాడు. ప్రస్తుతం ఈ దగ్గుబాటి హీరో దర్శకుడు క్రిష్ చెప్పే కథలు వింటున్నాడని సమాచారం. అలానే పూరీ జగన్నాథ్ తో కూడా సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు టాక్.  
 
 
Attachments