HomeTelugu Newsతరుణ్‌ భాస్కర్‌తో వెంకీ 75వ చిత్రం!

తరుణ్‌ భాస్కర్‌తో వెంకీ 75వ చిత్రం!

10 1
టాలీవుడ్‌ హీరో విక్టరీ వెంకటేష్ తన 74వ చిత్రంగా ‘నారప్ప’ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘అసురన్’కి చిత్రానికి రీమేక్ ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ రీమేక్ రూపొందుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెంకటేష్‌ లుక్ .. కథాకథనాలు ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలవనున్నాయి.

ఈ సినిమా తరువాత వెంకటేష్‌ తన 75వ సినిమా కోసం, దర్శకుడు తరుణ్ భాస్కర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. కాగా ఇప్పటికే వెంకటేష్‌ కథ కూడా ఓకే చెప్పేశారని అంటున్నారు. మొత్తం స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో తరుణ్ భాస్కర్ ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమాను కూడా సురేశ్ ప్రొడక్షన్స్ వారే నిర్మించనున్నట్టు తెలుస్తోంది. హార్స్ రేసింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనీ, ‘నారప్ప’ సినిమా షూటింగ్ పూర్తికాగానే కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu