HomeTelugu Big Storiesలెజెండరీ క్రికెటర్‌తో వెంకటేష్‌ సెల్ఫీ

లెజెండరీ క్రికెటర్‌తో వెంకటేష్‌ సెల్ఫీ

Venkatesh selfie with vivia
టాలీవుడ్ వెంకటేష్‌ మంచి క్రికెట్‌ లవర్‌ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా ముంబైలో జరుగుతున్న ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో సందడి చేశాడు వెంకటేశ్‌. వెంకటేశ్‌ వెస్టిండీస్‌ లెజెండరీ మాజీ క్రికెట్‌ దిగ్గజం వివిన్‌ రిచర్డ్స్‌ తో సెల్ఫీ దిగాడు. ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో దిగ్గజ క్రికెటర్‌ వివిన్‌ రిచర్డ్స్‌తో కలిసి ఉండటం ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేశాడు వెంకీ.

ఈ సెల్ఫీ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సెల్ఫీ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు, అభిమానులు వెంకీ మామ నిజమైన క్రికెట్‌ ఫ్యాన్‌.. ఇవాళ గ్రాండ్ విక్టరీ మామా.. మీరు వెళ్లారు కదా ఇవాళ మ్యాచ్ మనదే.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్స్‌.. వెంకీ మామా సూపర్ ఫొటో.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు .

వెంకటేశ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న చిత్రం ‘సైంధవ్‌’. హిట్ ఫేం శైలేష్‌ కొలను డైరెక్షన్‌లో వస్తున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వెంకటేశ్‌ 75వ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu