HomeTelugu Newsవెంకటేష్‌ 75వ సినిమా అదేనా.!

వెంకటేష్‌ 75వ సినిమా అదేనా.!

6 11
విక్టరీ వెంకటేష్‌ తాజా నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’ రేపు భారీ స్థాయిలో ప్రేక్షకులను పలకరించనుంది. పూర్తిస్థాయి వినోదభరిత చిత్రంగా నిర్మితమైన ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. ఆ తరువాత వెంకటేష్‌ 74వ చిత్రంగా ‘అసురన్’ రీమేక్ సెట్స్ పైకి వెళ్లనుంది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో సంఖ్యా పరంగా ప్రాధాన్యతను సంతరించుకున్న వెంకటేష్‌ 75వ సినిమాను గురించి అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇంతకుముందు తరుణ్ భాస్కర్ వినిపించిన ఒక కథకి వెంకటేష్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందువలన ఆయన 75వ సినిమా తరుణ్ భాస్కర్ తోనే ఉండొచ్చునని కొందరు అంటున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత అనిల్ రావిపూడి వెంకటేష్‌ తో ‘ఎఫ్ 3’ చేయాలనుకుంటున్నాడు. అనిల్ రావిపూడి సక్సెస్ రేట్ కారణంగా తన 75వ సినిమాను ఆయనతో చేయడానికే వెంకటేష్‌ మొగ్గుచూపుతున్నాడని మరికొందరు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!