`చుట్టాల‌బ్బాయి` బావున్నాడు – కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు

`చుట్టాల‌బ్బాయి` బావున్నాడు – కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమితా ప్రమోద్‌ జంటగా శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై వీరభద్రమ్‌ దర్శకత్వంలో నవ నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘చుట్టాలబ్బాయి`. ఈ సినిమా ఆగ‌స్ట్ 19న విడుద‌లై మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. రీ సెంట్‌గా ఈ చిత్రాన్ని కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో వీక్షించారు. షో అనంతరం..

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ “ సాయికుమార్ చాలా కాలంగా నాకు మంచి మిత్రుడు. అత‌ని త‌న‌యుడు ఆది న‌టించిన చుట్టాల‌బ్బాయి సినిమాను చూడ‌మ‌ని న‌న్ను అడ‌గ్గానే ఈరోజు వీలు చూసుకుని చూశాను. చుట్టాల‌బ్బాయిగా ఆది ఆది ఫైట్స్‌, డ్యాన్స్‌లు, న‌ట‌న చ‌క్క‌గా ఉంది. న‌మిత తెలుగింటి అమ్మాయిలా క‌న‌ప‌డింది. హీరో హీరోయిన్స్ ఇద్ద‌రూ పోటీపడి మంచి ఈజ్‌తో న‌టించారు. ద‌ర్శ‌కుడు వీర‌భ్ర‌దం సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. గ్రామీణ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో మంచి కుటుంబ విలువ‌లున్నాయి. గంభీర‌మైన పాత్ర‌లో సాయికుమార్‌గారి న‌ట‌న ఆక‌ట్టుకుంది“ అన్నారు.

నిర్మాత‌లు వెంక‌ట్ త‌లారి, రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ “మా సినిమాను కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడుగారు వీక్షించి మమ్మ‌ల్ని అభినందించ‌డం చాలా ఆనందంగా ఉంది. మాలో ఉత్సాహం పెరిగింది. అన్నీ ఏరియాస్ నుండి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది“ అన్నారు.

సాయికుమార్ మాట్లాడుతూ “వెంక‌య్య‌నాయుడుగారితో ఉన్న మంచి అనుబంధం కార‌ణంగా ఆయ‌న మా అబ్బాయి నటించిన చుట్టాల‌బ్బాయి సినిమా కోసం ప్ర‌త్యేక‌మైన స‌మ‌యం కేటాయించి, వీక్షించి అభినందించినందుకు ఆయ‌న‌కు థాంక్స్‌“ అన్నారు.

ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి మాట్లాడుతూ “వెంక‌య్య‌నాయుడుగారంటే చిన్న‌ప్ప‌ట్నుంచి అభిమానం. ఈరోజు నా ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన సినిమాను ఆయ‌న అభినందించ‌డం ఎంతో ఆనందంగా ఉంది“ అన్నారు.

హీరో ఆది మాట్లాడుతూ “సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. కేంద్ర‌మంత్రి వ‌ర్యులైన వెంక‌య్య‌నాయుడుగారు మా సినిమాను అభినందించ‌డం ఎంతో హ్యాపీగా ఉంది“ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ర‌ఘుబాబు, హీరోయిన్ న‌మిత‌ప్ర‌మోద్ త‌దిత‌రులు పాల్గొని సినిమా స‌క్సెస్ ప‌ట్ల త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.  

CLICK HERE!! For the aha Latest Updates