మూడో భర్తను ఇంటి నుండి తరిమేసిన వనితా

నటి వనితా విజయ్ కుమార్‌ తరచూ వార్తల్లో నిలుస్తునే ఉంటుంది. ఇటీవలే ఆమె మూడో పెళ్లి సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. సినీ ఇండస్ట్రీకి చెందిన పీటర్ పాల్‌ని వనితా జూన్‌లో పెళ్లి చేసుకుంది. పీటర్ తనను బాగా అర్థం చేసుకున్నాడని, అందుకే ఆయనతో జీవితం పంచుకోవాలనుకుంటున్నానని అప్పట్లో వనితా వ్యాఖ్యనించింది. అయితే వీరి పెళ్లి తరువాత పీటర్ మొదటి భార్య అతడిపై కేసు పెట్టింది. తనకు విడాకులు ఇవ్వకుండానే పీటర్, వనితాను పెళ్లి చేసుకున్నాడని ఆరోపణలు చేసింది. పలువురు సినీ ప్రముఖులు సైతం వనితాపై విమర్శలు కురిపించారు. వాటన్నింటికి వనితా గట్టిగానే కౌంటర్ కూడా ఇచ్చింది.

ఇటీవల వనితా, పీటర్‌లు పిల్లలను తీసుకొని గోవా ట్రిప్‌కి వెళ్లారు. అక్కడ వీరిద్దరు తీసుకున్న కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే కోలీవుడ్‌లో తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. గోవా ట్రిప్‌లో మద్యాన్ని సేవించిన పీటర్‌.. వనితాతో అసభ్యంగా ప్రవర్తించారట. దీంతో ఆమె, అతడిని కొట్టిందట. ఇక చెన్నైకి వచ్చిన తరువాత కూడా పీటర్‌ మద్యం మత్తులో ఉండటంతో అతడిని ఇంటి నుంచి గెంటేసిందట. ప్రస్తుతం ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ విషయాన్ని నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇల్లీగల్‌ మ్యారేజ్‌కి వ్యతిరేకంగా చాలా మంది కోరుకున్న కోరిక నెరవేరింది. పీటర్ పాల్‌ని తన్ని తరిమేశారు అని కామెంట్ పెట్టారు. దీనిపై వనితా స్పందిస్తుందో చూడాలి.

CLICK HERE!! For the aha Latest Updates