HomeTelugu Big StoriesVenu Swamy: కథ కంచికి.. ఈ బాబు ఇక ఇంటికి!

Venu Swamy: కథ కంచికి.. ఈ బాబు ఇక ఇంటికి!

venu swamy Venu Swamy

Venu Swamy- Y.S.Jagan: గత కొద్ది రోజుల నుంచి.. నూటికి ఏమి వస్తే.. అది చెబుతూ.. మీడియాలో చలామణి అవుతున్నారు వేణు స్వామి. అయితే ప్రస్తుతం ఈ స్వామి పరిస్థితి మాత్రం స్వామియే శరణం అయ్యప్ప అయ్యేలా ఉంది.

అసలు విషయానికి వస్తే నాగచైతన్య, సమంత విడాకుల విషయం ముందుగా చెప్పి ఫేమస్ అయ్యారు వేణు స్వామి. అప్పటినుంచి తానేదో పెద్ద దేవుడిలా ఫీల్ అయిపోతూ.. తాను భవిష్యత్తు మొత్తం చూసేసిన వారిలా.. నోటికొచ్చిన సొల్లు మొత్తం మీడియాలో చెబుతూ ఉన్నారు.  వంద రాళ్లు బావిలో వేస్తే..ఏదో ఒక రాయి బావిలో పడినట్టు.. ఈయన వంద చెప్పితే అందులో ఒక్కటి మాత్రం నిజం అవుతుంది. దానికే ఈ స్వామి కాస్త.. తాను ఏందో పుష్ప లో స్వామి అన్నట్టు.. తగ్గేదేలే అంటున్నారు..

నాగచైతన్య, సమంత విషయం కూడా.. ఒకసారి వేణు స్వామి ఒక బారు కి వెళ్ళగా.. అక్కడ విని తెలుసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కాబట్టి అది కూడా ఆయన తెలివితో ఆయన చెప్పింది కాదు. ఇక ఆ తరువాత ఈ దొంగ స్వామి చెప్పిన ఒక్క విషయం కూడా నిజం కాలేదు. తెలంగాణలో కేసీఆర్ తప్పకుండా మరోసారి సీఎం అవుతారని…ఐపీఎల్ లో ఈసారి తప్పకుండా ఎస్.ఆర్.హెచ్ గెలుస్తుందని.. ప్రభాస్ కి నమ్ముకున్న నిర్మాతలు అందరూ ఇక కంచికే అని.. ఇలా ఏవేవో చెప్పుకుంటూ వచ్చాడు. అయితే వీటిలో ఒక్కటి కూడా నిజం కాలేదు.

ఈ క్రమంలో నిన్నటి వరకు.. జగన్ కాబోయే సీఎం అంటూ తెగ విర్రివిగాడు. ఇక ఈ స్వామి తప్పకుండా జగన్ సీఎం అవుతారు అని చెప్పిన వీడియోలో.. పక్కనే జగన్ కూర్చో ఉండడం.. ఇక ఆ వీడియోని సోషల్ మీడియా యూజర్స్ వైరల్ చేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో.. ఇప్పుడు వేణు స్వామి ఇక రేపటి నుంచి ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి రాబోతోందని అర్థమవుతోంది. ఎందుకంటే.. రేపు ప్రకటించే ఫలితాలలో.. టిడిపి విజయం సాధించడం తథ్యం. ఇక ఆ విజయం వార్త బయటకు రాగానే.. టిడిపి, పవన్ కళ్యాణ్ అభిమానులు వేణు స్వామిని సోషల్ మీడియాలో వేసుకోవడం కూడా ఖాయం. ఇక వేరే కాకుండా ఆల్రెడీ వేణు స్వామిని ప్రభాస్ అభిమానులు ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.

ఇలా లెఫ్ట్ అండ్ రైట్ సోషల్ మీడియాలో వేణు స్వామికి మోగిపోతోంది. కాబట్టి ఇక కథ కంచికి..వేణు స్వామి ఇంటికి అనేలానే ఉంది పరిస్థితి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!