HomeTelugu Newsదృశ్యం-2 తెలుగు రీమేక్ వెంకటేష్‌ చేయడం లేదా?

దృశ్యం-2 తెలుగు రీమేక్ వెంకటేష్‌ చేయడం లేదా?

Victory Venkatesh on Drishy
మలయాళంలో సూపర్‌ మోహన్ లాల్ హీరోగా నటించిన చిత్రం ‘దృశ్యం’. ఈ సినిమా సూపర్‌ హిట్ కావడం తో తెలుగులో విక్టరి వెంకటేశ్ హీరోగా రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. ఈ క్రమంలో తాజాగా మలయాళంలో ‘దృశ్యం 2’ని నిర్మించారు. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 19న కేరళలో విడుదల అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్ చేయడానికి వెంకీ సిద్ధంగా లేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం మలయాళం దృశ్యం-2 డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదల కావడమేనట. ఫిబ్రవరి 19న రాబోతున్న ఈ సీక్వెల్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతోంది. మొదటి పార్టు క్రియేట్ చేసిన ఇంట్రస్ట్ దృష్ట్యా.. వరల్డ్ వైడ్ గా చాలా మంది ఈ సినిమాను ఓటీటీలో చూసే అవకాశం ఉందని వెంకీ భావిస్తున్నాడట.

చాలా మంది మలయాళం ఈ సినిమాను ఓటీటీలో చూసేసిన తర్వాత.. రివ్యూలు చదివేసిన తర్వాత.. మళ్లీ తెలుగులో రీమేక్ చేస్తే అంత క్యూరియాసిటీ ఉండదని భావిస్తున్నాడట వెంకటేష్‌. ఇదే విషయాన్ని తన అన్న సురేష్ బాబుతో చర్చించారని దీంతో.. ఈ ప్రాజెక్ట్ కు దూరంగా ఉండడమే మేలని నిర్ణయించుకున్నారని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu