HomeTelugu Trendingవిజయ్‌ దేవరకొండ డైరెక్టర్‌తో వెంకటేష్‌..!

విజయ్‌ దేవరకొండ డైరెక్టర్‌తో వెంకటేష్‌..!

9 18
టాలీవుడ్‌ సీనియర్ హీరో వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తోడుగా చేసిన ‘ఎఫ్2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో వెంకటేష్.. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రెజెంట్ వెంకటేష్.. బాబీ (కే.యస్.రవీంద్ర) దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంకటేష్.. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలను డైరెక్ట్ చేసిన విలక్షణ దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో నెక్ట్స్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే తన రెండు సినిమాలను సురేష్ ప్రొడక్షన్‌ విడుదల చేసింది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సురేష్ బాబు నిర్మిస్తున్నాడు.

వెంకటేష్‌తో తరుణ్ భాస్కర్.. హార్స్ రైడింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ అయింది. వెంకటేష్ కూడా ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. హైదరాబాద్ మలక్‌పేటలోని రేసు కోర్స్ నేపథ్యంలో పక్కా హైదరాబాదీ నేపథ్యంలో తెరకెక్కించే అవకాశాలున్నాయట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu