HomeTelugu Newsf2' ఫస్ట్‌ సాంగ్‌.. రెచ్చిపోదాం బ్రదర్‌ అంటున్న వెంకీ, వరుణ్‌

f2′ ఫస్ట్‌ సాంగ్‌.. రెచ్చిపోదాం బ్రదర్‌ అంటున్న వెంకీ, వరుణ్‌

10 15విక్టరీ వెంకటేష్‌‌, యువ నటుడు వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘f2’. ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్’‌ అనేది ఉప శీర్షిక. అనిల్‌ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు విశేష స్పందన లభించింది. కాగా ఇందులోని మొదటి పాట టీజర్‌ను ఈ రోజు (బుధవారం) విడుదల చేశారు. ‘క్రికెట్‌ ఆడే బంతికి రెస్టే దొరికినట్టు ఉందిరో.. 1947 ఆగస్టు 15ని నేడే చూసినట్లు ఉందిరో.. రెచ్చిపోదాం బ్రదర్‌..’ అని సాగే ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. వెంకీ, వరుణ్‌, రాజేంద్ర ప్రసాద్‌ కలిసి ఆనందంగా సందడి చేస్తూ కనిపించారు.

వరుణ్‌ ప్రస్తుతం ‘అంతరిక్షం’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. శుక్రవారం ఈ చిత్రం విడుదల కాబోతోంది. సంకల్ప్‌ దర్శకుడు. అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాత. అంతరిక్షం నేపథ్యంలో సాగే కథే ఇది. వెంకటేష్‌ ప్రస్తుతం ‘వెంకీ మామ’ చిత్రంలో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!