HomeTelugu Trendingమహేష్‌ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ

మహేష్‌ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ

Vidya balan in sarkaru va
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురాం డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. కాగా ఇప్పటికే విలన్ పాత్రకు బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ని తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమాలో మరో కీలక పాత్ర అయిన హీరో తల్లి పాత్రకు ప్రముఖ నటి విద్యాబాలన్ తో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆమె కూడా ఈ సినిమా చేయడానికి సానుకూలంగా ఉన్నట్టు సమాచారం.

ఇక చిత్రం షూటింగ్ విషయానికి వస్తే, తొలి షెడ్యూలును అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో నిర్వహించడానికి నిర్ణయించారు. త్వరలోనే చిత్ర దర్శకుడు, కెమేరామేన్ కలసి లొకేషన్ల ఎంపికకు డెట్రాయిట్ వెళతారని అంటున్నారు. అక్కడ 45 రోజుల పాటు షూటింగును నిర్వహిస్తారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో అక్కడ షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu