హాస్పటల్‌లో చేరిన విజయ్ దేవరకొండ..?

టాలీవుడ్ సెన్సేషన్ స్టార్‌ విజయ్ దేవరకొండ అస్వస్థకు గురైనట్టు వార్తలు ఫిల్మ్ సర్కిల్‌లో హల్ చల్ చేస్తున్నాయి. హోలీ సంబరాల్లో మునిగితేలిన విజయ్ బాగా నీరసించిపోవడంతో ఫీవర్ వచ్చి హాస్పటల్‌లో అడ్మిట్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో రౌడీ ఫ్యాన్స్ పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదని.. వరుస షూటింగ్‌లతో క్షణం తీరిక లేకుండా గడపడం.. హోలీ సెలబ్రేషన్స్‌లో ఒకేసారి శారీరక ఒత్తిడి కలగడం జ్వరం వచ్చిందని రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ ‘డియర్ కామ్రేడ్’ విడుదలకు రెడీగా ఉంది. రష్మిక, విజయ్ దేవరకొండ.. ‘గీత గోవిందం’ చిత్రం తరువాత రెండోసారి జోడీ కట్టారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మికల మధ్య లిప్ లాక్ సన్నివేశం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇక ఈ సినిమా తరువాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పనిచేస్తున్నారు విజయ్ దేవరకొండ.