నాగబాబు కొడుకుగా.. నిహారిక బ్రదర్‌గా.. ‘సూర్యకాంతం’ ప్రీ రిలీజ్‌లో విజయ్‌ దేవరకొండ స్పీచ్..

మెగాడాటర్ నిహారిక, రాహుల్ విజయ్ నటించిన చిత్రం ‘సూర్యకాంతం’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్‌‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ హాజరై చిత్ర యూనిట్‌కి విషెష్ అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎలా ఉన్నార్రా.. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. నేను నిహారిక వాళ్ల నాన్న నాగబాబుతో వర్క్ చేశా. గీత గోవిందం సినిమాలో ఆయనతో చేసినప్పుడు నాన్న ఫీల్ వచ్చింది. ఫస్ట్ డే నాగబాబు గారు నాతో మాట్లాడుతూ.. నువ్ మంచోడివేనయ్యా.. అన్నారు. సార్ అలా ఎందుకు అనుకున్నారు అన్నా. ప్రస్తుతం నాగబాబు పొలిటికల్‌గా బిజీ అయ్యారు. వరుణ్ తేజ్‌ కూడా యూఎస్‌లో ఉండటంతో ఇక్కడకు రావడం కుదరలేదు.

ఈరోజు నాగబాబుకి కొడుకుగా.. నిహారికకి బ్రదర్‌గా.. బిగ్ బ్రదర్ డ్యూటీ చేస్తున్నా.. చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా టీజర్‌ చూశా. చాలా బాగుంది. ఈ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీం నా సినిమాలకు కూడా పనిచేశారు. మార్చి 29న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉందంటూ స్పీచ్ ముగించారు విజయ్ దేవరకొండ.