రౌడీస్‌కు దేవరకొండ విజ్ఞప్తి!

హీరో విజయ్ దేవరకొండ అనతి కాలంలోనే బోలెడంత ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. తన అభిమానుల్ని మై డియర్ రౌడీస్ అని పిలుస్తుంటాడు విజయ్. అంతేకాదు సొంతగా రౌడీ అనే వస్త్ర బ్రాండ్ ను నెలకొల్పాడు. దీంతో ఆ పేరు కాస్త యువతలో, ముఖ్యంగా విజయ్ అభిమానుల్లో బాగా పాపులర్ అయిపోయింది. ఎంతలా అంటే కుర్రాళ్ళు తన బైక్స్ నెంబర్ ప్లేట్ల మీద నెంబర్ తీసేసి రౌడీ అని రాసుకుంటున్నారు.

ఇదే నగర ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పిగా మారింది. తాజాగా అలా నెంబర్ లేకుండా రౌడీ అనే పేరున్న ఒక బైక్ ను పోలీసులు పట్టుకుని జరిమానా విధించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న విజయ్ స్పందిస్తూ చిక్కుల్లో పడకండి. రూల్స్ పాటించండి. బైక్ మీద ఎక్కడైనా రౌడీ అని రాసుకోండి కానీ నెంబర్ ప్లేట్ మీద మాత్రం కేవలం నెంబర్ మాత్రమే ఉండేలా చూసుకుని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించండి అని విజ్ఞప్తి చేశాడు.