
Shahrukh Khan Allu Arjun movie update:
ముంబయిలో జరుగుతున్న WAVES 2025 Summit లో సినిమా ప్రేమికులకు అదిరే విషయం వినిపించింది. టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ “Cinema: The Star Power” అనే ప్యానెల్ డిస్కషన్ లో పాల్గొన్న సమయంలో ఓ ఊహా ప్రపంచాన్ని ఊపేసాడు.
అల్లు అర్జున్, షారుక్ ఖాన్ ఇద్దరూ వేర్వేరు ఇండస్ట్రీల నుండి వచ్చి రూ.1000 కోట్ల బ్లాక్‌బస్టర్స్ అందించినవాళ్ళు. “ఇద్దరూ ఒకే సినిమాలో ఉంటే ఇండియన్ సినిమా చరిత్రలోనే మైలు రాయి అవుతుంది” అన్నాడు విజయ్. ఈ మాటలు విన్న వెంటనే కరీనా కపూర్, కరణ్ జోహార్ కూడా ఉత్సాహంగా స్పందించారు.
విజయ్ చెప్పినట్టు, ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ వల్ల భాషల మధ్య గల గోడలు కరుగుతున్నాయి. నేడు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి War 2 చేస్తున్నారు. ఇలాంటివే మరిన్ని అవసరమన్నారు కరణ్.
ఇలాంటి బడా ప్రాజెక్ట్ కి Atlee లాంటి డైరెక్టర్ సరిపోతాడు అని భావం వ్యక్తం చేశారు. అతను ఇప్పటికే షారుక్ తో Jawan, అల్లు అర్జున్ తో కొత్త సినిమా చేస్తూ పాన్ ఇండియా మార్కెట్ ని ఆకర్షిస్తున్నాడు.
ఇది కచ్చితంగా ఫిక్స్ అయిన ప్రాజెక్ట్ కాదుగానీ, అలాంటి కలయిక మీద ఆలోచన వచ్చినా చాలు – అభిమానులు ఓపికగా ఎదురుచూస్తారన్న మాట. ఈ కల నిజం అయితే ఇండియన్ సినిమా స్టాండర్డ్ ఇంకా పెరిగిపోతుంది.
ALSO READ: రెండవ రోజు HIT 3 collections ఎలా ఉన్నాయంటే