HomeTelugu Big StoriesRRR: ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రొడ్యూస‌ర్‌తో విజయ్‌ దళపతి మూవీ..భారీ రెమ్యూనరేషన్‌

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రొడ్యూస‌ర్‌తో విజయ్‌ దళపతి మూవీ..భారీ రెమ్యూనరేషన్‌

Vijay Thalapathy movie with

RRR: ప్రస్తుతం టాలీవుడ్‌లో తమిళ స్టార్‌ హీరోలు కూడా సందడి చేస్తున్నారు. తెలుగులో నేరుగా సినిమాలు చేసి తమ మార్కెట్‌ని పెంచుకుంటున్నారు. ధనుష్‌ నేరుగా తెలుగులో చేసిన ‘సార్‌’ మూవీ మంచి సక్సెస్‌ అయింది. ఇక విజయ్‌ దళపతి కూడా తెలుగు ప్రొడ్యుసర్‌లతో వరుస మూవీలు చేస్తూ.. భారీ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం విజ‌య్‌ ఒక్కో సినిమా కోసం 120 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. ద‌క్షిణాదిలో హ‌య్యెస్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరోల్లో విజయ్‌ ఒకరు.

Thalapathy Vijay Receives An Offer Of Salary Higher Than Leo's 120 Crores?

గతంలో దిల్‌రాజ్‌తో గతంలో వారసుడు మూవీకి దిల్‌రాజు కూడా విజ‌య్‌కి భారీగా రెమ్యున‌రేష‌న్ ముట్ట‌చెప్పాడు. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీకి విజ‌య్ 125 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకున్నాడు. దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ కార‌ణంగా 300 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. కాగా 2026 త‌మిళ‌నాడు ఎలెక్ష‌న్స్‌లో విజ‌య్ పోటీ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

తాజాగా విజ‌య్ మరోసారి తెలుగు ప్రొడ్యూసర్‌తో ఓ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు కోలీవుడ్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూస‌ర్ డీవీవీ దాన‌య్య‌తో విజ‌య్ సినిమా చేయ‌నున్న‌ట్లు టాక్‌. విజ‌య్ 69వ మూవీ డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్‌లో ఫిక్సైన‌ట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే మూవీకి డైరెక్ట‌ర్ ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమాకి కోలీవుడ్‌, టాలీవుడ్‌కు చెందిన ప‌లువురు స్టార్‌ డైరెక్టర్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ రానున్న‌ట్లు తెలుస్తుంది.

కాగా ఈ సినిమాకిగాను విజ‌య్ త‌న‌ రెమ్యున‌రేష‌న్ పెంచిన‌ట్లు స‌మాచారం. విజ‌య్‌కి తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాన‌య్య రికార్డ్ రెమ్యున‌రేష‌న్‌ను ఆఫ‌ర్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమా కోసం విజ‌య్‌ 150 కోట్లు రెమ్యున‌రేష‌న్‌గా స్వీక‌రించ‌బోతున్న‌ట్లు కోలీవుడ్ స‌ర్కిల్స్‌లో న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది. విజ‌య్ రెమ్యున‌రేష‌న్‌తో క‌లిపి ఈ సినిమా బ‌డ్జెట్ నాలుగు వంద‌ల కోట్ల‌కుపైనే ఉంటుంద‌ని స‌మాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!