స్కూల్ పరీక్ష పేపర్ లో విజయ్ దేవరకొండ?

టాలీవుడ్‌లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘విజయ్‌ దేవరకొండ’. ఆ తరువాత వచ్చిన గీతాగోవిందం, టాక్సివాలా సినిమాలతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ తన అభిమానులను ముద్దుగా రౌడీస్ అని పిలుస్తుంటాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. అయితే ఆయన పేరు ఓ పరీక్షా పత్రంలో ప్రత్యక్షం కావడం హాట్ టాపిక్‌గా మారింది .

ఓ స్కూల్ పరీక్షా పత్రంలో 8వ ప్రశ్న ఇంగ్లీష్ గ్రామర్ పేపర్‌లో “అర్జున్ రెడ్డి” సంబంధించిన ప్రశ్న ఉంది. Vijay Devarakonda has been________ since his blockbuster movie ‘Arjun Reddy’.. అని ప్రశ్న ఇచ్చి కింద నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు. పరీక్ష పేపర్‌లో విజయ్ పేరు చూసిన అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి.

గతంలోను పలువురు స్టార్స్ పేర్లు పరీక్ష పేపర్‌లో ప్రత్యక్షమైన, విజయ్ దేవరకొండ క్రేజ్ వేరు కాబట్టి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. గతంలో విరాట్ కోహ్లీ గాళ్ ఫ్రెండ్ ఎవరు అని ఓ ప్రశ్నాపత్రంలో అడిగినందుకు వివాదం రేగింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ క్వశ్చన్ వచ్చింది. మొత్తానికి విజయ్ ఇమేజ్ ఇప్పుడు స్కూల్స్ లో పరీక్ష పేపరు వరకు పాకిందన్నమాట.