HomeTelugu Trendingవెంకట్‌ ప్రభుతో విజయ్‌ మూవీ

వెంకట్‌ ప్రభుతో విజయ్‌ మూవీ

vijay thalapathy movie with

వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు తమిళ నటుడు విజయ్‌. ప్రస్తుతం లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో లియో సినిమా చేస్తున్న సంగతి తెలసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్‌ ఈ మూవీపై అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌లో విడుదల కానుంది.

ఇక ఈ సినిమా తర్వాత విజయ్‌.. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ యాక్షన్‌ సినిమా చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. ప్రముఖ తమిళ ప్రొడక్షన్‌ సంస్థ ఏజీఎస్‌ ఎంటర్‌టైనమెంట్స్‌ అధికారికంగా పోస్టర్‌ను, ఓ స్పెషల్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. యువన్‌ శంకర్‌ రాజా ఈ సినిమాకు స్వరాలు సమకూర్చుతున్నాడు.

ఏజీఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై క‌ల్పాతి ఎస్‌.అఘోరాం ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా కోసం విజయ్‌ దాదాపు రెండోందల కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు గత రెండు, మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu