HomeTelugu TrendingVijay The GOAT: సింగర్‌గా మారిన విజయ్‌.. ఎన్ని పాటలు పాడాడో తెలుసా?

Vijay The GOAT: సింగర్‌గా మారిన విజయ్‌.. ఎన్ని పాటలు పాడాడో తెలుసా?

Vijay The GOAT

Vijay The GOAT: హీరో విజయ్‌కి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. తాను సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్ల నుంచే యాక్టింగ్‌తోపాటు పాటలు కూడా పాడుతున్నాడు విజయ్. 1994లో తొలిసారి తాను నటించిన రసీగన్ మూవీలో విజయ్ ఓ పాట పాడాడు. ఆ తర్వాత 2005 వరకు వరుసగా 25 పాటలు పాడుతూ వచ్చాడు.

అప్పుడు బ్రేక్ తీసుకొని 2012లో మరోసారి తుపాకీ మూవీలో ఓ పాట పాడాడు. అప్పటి నుంచీ ప్రతి ఏటా తన సినిమాల్లో కనీసం ఒక్క పాటైనా పాడుతూ వస్తున్నాడు. తాజా ఆయన హీరోగా నటిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ మూవీ కోసం సింగర్‌గా మారాడు. ఈ మూవీ కోసం అతడు రెండు పాటలు పాడినట్లు మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా వెల్లడించాడు.

ఇలా ఒకే సినిమాలో రెండు పాటలు పాడటం ఇది మూడోసారి మాత్రమే. ఇందులో తొలి పాట విజిల్ పోడు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోపాటను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో మాత్రం రెండు పాటలు పాడటం విశేషం.

ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. జయరాం, స్నేహ, లైలా, యోగి బాబులాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ జానర్ లో వస్తున్న మూవీలో విజయ్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. యువకుడుగా ఒక పాత్ర, మధ్య వయస్కుడిగా రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. యుక్త వయసు పాత్ర కోసం ఏఐ సాయంతో డీఏజింగ్ కూడా చేస్తున్నారు. దళపతి విజయ్ కెరీర్లో ఇది 68వ సినిమాగా రానుంది. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచీ దీనిపై మంచి క్రేజ్ నెలకొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu