యుట్యూబ్ హీరోయిన్ తో విజయ్ రొమాన్స్!

విజయ దేవరకొండ అంటే ఎవరు అని ఒక్క క్షణం అలోచించి ఓ అర్జున్ రెడ్డా అంటున్నారు అంతా.ఆ రేంజ్ లో విజయ్ కి ఫాలోయింగ్ ని ఫేమ్ ని తీసుకొచ్చింది అర్జున్ రెడ్డి.అర్జున్ రెడ్డి తరువాత మిడిల్ రేంజ్ హీరో మార్క్ ని కూడా క్రాస్ చేసేసాడు.అల్లు అరవింద్ లాంటివాళ్లు మనోడిని పొగుడుతున్న మాటలు వింటుంటే అర్ధం అవుతుంది టాలీవుడ్ లో విజయ్ ఎంతటి సంచలనం సృష్టించాడో.అర్జున్ రెడ్డి లో ఇన్వాల్వ్ అయిపోయి సినిమా రిలీజ్ టైం లో అదే యాటిట్యూడ్ చూపించడంతో జనం అంతా..ముఖ్యంగా యూత్ కనెక్ట్ అయిపోయారు.కట్ చేస్తే ఇప్పడు మనోడు ఫుల్ బిజీ..బిజీ.ఇప్పటికే గీత ఆర్ట్స్ లో రెండు సినిమాలు చేస్తున్న విజయ దేవరకొండ ఆ రెండు సినిమాల తరువాత నెక్స్ట్ రేంజ్ లోఉంటాడని స్వయంగా అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు.అయితే ఆ రెండు సినిమాల్లో ఒక సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పూర్తయింది.ఇందులో హీరోయిన్ గా విజయ్ కి గుర్తింపు తెచ్చిన ఎవడె సుబ్రహ్మణ్యం హీరోయిన్ మాళవిక నాయర్ మెయిన్ ఫిమేల్ లీడ్ గా కనిపిస్తుంది.

అయితే అందులో సెకండ్ హీరోయిన్ గా అనంతపురానికి చెందిన ప్రియాంక జవాల్కర్ నటించబోతుంది.ఈ అమ్మాయి పేరెంట్స్ మహారాష్ట్ర నుండి వచ్చి అనంతపురంలో సెటిల్ అయ్యారట.దాంతో ఈ అమ్మాయి యు ట్యూబ్ లో నటిస్తూ డైరెక్ట్ గా ఏ రికమెండేషన్ లేకుండా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.సో,ఒక భారీ హిట్ పడినా కూడా ఇంకా డైరెక్టర్స్,ప్రొడ్యూసర్స్ చాయిస్ ని గౌరవిస్తూ చకా చకా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న విజయ్ ని మెచ్చుకోవాల్సిందే.అర్జున్ రెడ్డి తరువాత షికార్ అనే మరో యూత్ ఫుల్ సినిమాతో ఇంకో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు విజయ్ దేవరకొండ అలియాస్ అర్జున్ రెడ్డి.