వినాయక్ తో మెగామేనల్లుడు!

ఖైదీ నెంబర్ 150 సినిమా తరువాత వినాయక్ తదుపరి సినిమా ఎవరితో చేస్తారనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఎన్టీఆర్, పవన్ లాంటి స్టార్ హీరోల పేర్లు వినిపించాయి కానీ అందరూ బిజీగా ఉండడం వలన వినాయక్ కు డేట్స్ దొరకలేదు. తాజా సమాచారం ప్రకారం వినాయక్, యంగ్ హీరో సాయి ధరం తేజ్ తో సినిమా చేస్తున్నాడని సమాచారం.

పవన్, వినాయక్ తో పని చేయాలనుకున్నప్పటికీ మూడు ప్రాజెక్ట్స్ కమిట్ అవ్వడంతో తేజుతో సినిమా చేయమని వినాయక్ కు చెప్పారట. తేజు అంటే పవన్ కు ప్రత్యేక శ్రద్ధ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే కాస్త ఫ్లాపుల్లో ఉన్న తేజుకి వినాయక్ సినిమా హెల్ప్ అయ్యే విధంగా ఈ ప్రాజెక్ట్ సెట్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం సాయి ధరం తేజ్ ‘జవాన్’ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా తరువాత వినాయక్ తో సినిమా చేస్తాడేమో.. చూడాలి!