అభిమానులుకు ‘విరాట్‌’ నూతన సంవత్సరం శుభాకంక్షాలు

ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరం సంబరాలు కొన్ని దేశాల్లో మొదలుయ్యాయి. ఇప్పటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కొత్త సంవత్సరం వచ్చేసింది. ఆ దేశాల్లోని ప్రజలు పెద్ద సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కొత్త సంవత్సర సంబరాలు చేసుకున్నాడు. విరాట్ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి సిడ్నీ నగరంలోని రోడ్లపై విహరిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నాడు.

ఈ సందర్భంగా విరాట్.. అనుష్కతో దిగిన ఫోటోలను ట్వీట్ చేస్తూ తన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపాడు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ ఈ సంవత్సరం గొప్పగా ఉండాలి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి’ అని విరాట్ ట్వీట్ చేసాడు.