విశాల్, వరలక్ష్మిలు విడిపోయారా..?

తమిళ హీరో విశాల్ గత ఏడేళ్లుగా నటి వరలక్ష్మితో ప్రేమలో ఉన్నాడన్న సంగతి తెలిసిందే. వారి
ప్రేమను వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ అంగీకరించకపోవడం నడిగర్ ఎలెక్షన్స్ లో కావాలనే
విశాల్, శరత్ కుమార్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారని రకరకాల ఊహాగానాలు వినిపించాయి.
ఈ నేపధ్యంలో విశాల్ నడిగర్ సంఘంలో ఏర్పాటు కానున్న కళ్యాణ మండపంలో మొదటగా
జరిగేది నా పెళ్లే అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో విశాల్, వరలక్ష్మిని వివాహం చేసుకోబోతున్నాడని
వార్తలు జోరుగా వినిపించాయి. అయితే తాజాగా వరలక్ష్మి ట్విటర్ లో చేసిన కామెంట్ తో వీరిద్దరికి
బ్రేకప్ జరిగిందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమంటే ఇంతేనా.. ప్రపంచంలో
ప్రేమ ఏమవుతుందో.. ఎక్కడుందో.. అంటూ ట్వీట్ చేసింది. దీంతో విశాల్ కావాలని వరలక్ష్మిని
దూరం పెడుతున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. దానికి కారణం శరత్ కుమార్ తో విశాల్ కు
ఉన్న గొడవలే అని అర్ధమవుతోంది.