HomeTelugu Trendingగుత్తా జ్వాల, విష్ణు విశాల్‌ పెళ్లి తేదీ ఫిక్స్‌

గుత్తా జ్వాల, విష్ణు విశాల్‌ పెళ్లి తేదీ ఫిక్స్‌

Vishnu vishal gutta jwala w

భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌కు పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయి. గుత్తా జ్వాల తన సోషల్ మీడియా ద్వారా పెళ్లి తేదీని ప్రకటించేసింది. ఏప్రిల్ 22 న వీరు చేసుకోబోతున్నారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. మూడేళ్ల క్రితం తమ సంబంధాన్ని ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో జ్వాలా గుత్తా, తమిళ నటుడు విష్ణు విశాల్ నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశము అయ్యింది. కాగా విష్ణు విశాల్ 2010లో రజినీ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే విష్ణు, రజినీ 2018లో విడిపోయారు. జ్వాలా కూడా ఇంతకుముందు చేతన్ ఆనంద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. జ్వాలా, చేతన్ 2011లో విడిపోయారు. మరోవైపు దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కేవలం ఇరు కుటుంబాలతో పాటు అతికొద్ది మంది సమక్షంలోనే వివాహం చేసుకోనున్నట్లు వెల్లడించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu