HomeTelugu Trendingనేడే గుత్తా జ్వాల వివాహం.. ఫొటోలు వైరల్‌

నేడే గుత్తా జ్వాల వివాహం.. ఫొటోలు వైరల్‌

Vishnu vishal gutta jwala p

భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిని గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌ నేడు (ఏప్రిల్‌ 22)న పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మరొకాసేపట్లో వధూవరులుగా మారనున్నారు. కాగా గత రాత్రి జరిగిన మెహందీ ఫంక్షన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలకు ఇరువర్గాల కుటుంబ సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. ఇక మెహందీ వేడుకలకు గుత్తా జ్వాల పసుపు రంగు లెహంగాలో మెరిసిపోగా, బ్లాక్‌ కుర్తాలో విష్ణు విశాల్‌ సందడి చేశారు. ప్రస్తుతం జ్వాల-విశాల్‌ల మెహందీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో పలువురు అభిమానులు, సెలబ్రిటీలు ఈ ప్రేమ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 తమిళ నటుడు విష్ణువిశాల్, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల గత ఏడాది సెప్టెంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరూ ఈ రోజు పెళ్లి పీటలు ఎక్కుతున్నాు. కోవిడ్‌ కారణంగా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే వీరి వివాహం జరుగుతోంది. దగ్గరి బంధుమిత్రులతో గుత్తా జ్వాల ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలైయ్యాయి.

 పెళ్లికూతురుగా ముస్తాబైన జ్వాలా అమ్మతోనూ, బంధువులు, స్నేహితులతో కలసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇస్తోంది. మొదట వివాహాన్ని చాలా గ్రాండ్ గాచేసుకోవాలి అనుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇలా సింపుల్ గా ఈ జోడీ ఒక్కటి అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu