రాజమౌళి నెక్స్ట్ సినిమా ఇదే!

ఓటమెరుగని దర్శకుడు రాజమౌళి మూడున్నరేళ్లుగా బాహుబలి సినిమా షూటింగ్ తోనే గడుపుతున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో రాజమౌళి నెక్స్ట్ సినిమా ఏముంటుందనే విషయంలో ఆసక్తి పెరిగింది. గత కొన్ని రోజులుగా ఆయన టాలీవుడ్ ను వదిలేసి బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నాడని పుకార్లు వినిపించాయి. కానీ ఆ మాటల్లో నిజం లేదని రాజమౌళి తేల్చేశారు. టాలీవుడ్ లో నేను చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయని క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఎన్టీఆర్ తో లేదా మహేష్ బాబు తో రాజమౌళి సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. తాజాగా ఈ విషయంపై రాజమౌళి క్లారిటీ ఇస్తూ.. ప్రస్తుతానికైతే మరో మూడు నెలల పాటు బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటాను. ఆ తరువాత ఓ ఆరు నెలల పాటు విరామం తీసుకొని ‘మహా భారతం’ సినిమా మొదలుపెడతానని ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో వెల్లడించారు. అదన్నమాట మేటర్. మొత్తానికి మరో ఎపిక్ ను తెరకెక్కించడానికి రెడీ అయిపోతున్నాడు.