సీఎం ఏం చేసినా మళ్లీ సీఎం కావడం కోసమే

జగన్మోహన్ రెడ్డిని అందరూ చాలా తక్కువ అంచనా వేశారు. అసలు జగన్ రెడ్డి సీఎంగా ఏం చేసినా అది మళ్లీ సీఎం కావడం కోసం మాత్రమే. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మొదట వాలంటీర్ వ్యవస్థను తెచ్చినప్పుడు జగన్ రెడ్డికి ఏం తెలియడం లేదు అంటూ ఎగతాళి చేశారు. కానీ, జగన్ రెడ్డి కేవలం రానున్న ఎన్నికల కోసమే వాలంటీర్ వ్యవస్థను తెచ్చాడని ప్రత్యర్ధి పార్టీలకు ఇప్పుడు అర్ధం అవుతుంది. పైగా గ్రామ వాలంటీర్లు మంచి ఆలోచన అని, చాలామందికి ఉపాధి లభించటంతో పాటు, గ్రామ పాలన అందుబాటులోకి వచ్చింది అంటూ జగన్ రెడ్డికి ఓ వర్గంలో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. కాదు, వచ్చింది అని ప్రమోట్ చేసుకుంటున్నారు.

ఎలాగూ వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లు తన కోసం పని చేస్తారని జగన్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే, పక్కాగా వారి జీతాలను కూడా పెంచే ఆలోచన చేస్తున్నాడు. అదే సమయంలో చంద్రబాబు గెలిస్తే.. మీ జాబులు పోతాయనే భయాన్ని కూడా వాలంటీర్లకు కలిగిస్తున్నాడు. ఒక గ్రామంలో ప్రతి ఇంటితో ఆ గ్రామ వాలంటీర్ కి సంబంధం ఉంటుంది. ఎందుకంటే, వాలంటీర్ ద్వారానే ప్రతి వ్యక్తి లబ్ది పొంది ఉంటాడు. కాబట్టి.. అలాంటి వాలంటీర్ వచ్చి ఫలానా వారికీ ఓటు వేయండి అని చెబితే.. కచ్చితంగా పల్లెటూరి ప్రజలు ప్రభావితం అవుతారు. రానున్న ఎన్నికల్లో అదే జరుగుతుందనేది జగన్ రెడ్డి నమ్మకం. తన స్వార్థం కోసం ఎందరో యువకులతో పాటు ప్రజలను కూడా తప్పుద్రోవ పట్టించాడు జగన్ రెడ్డి.

జగన్ రెడ్డి లేవనెత్తిన మరో అంశం.. 3 రాజధానులు. నిజానికి మూడు రాజధానులు గురించి గుంటూరు – కృష్ణ జిల్లాలలో కొంత వ్యతిరేకత వచ్చినా, మిగిలిన జిల్లాల్లో పరిస్థితి తనకు సానుకూలంగా ఉంటుందనేది జగన్ రెడ్డి నమ్మకం. ఇప్పుడు అదే నిజం అయ్యేలా ఉంది. ఒకవేళ ఇది నిజం అయితే.. జగన్ రెడ్డికి మిగిలిన అన్నీ జిల్లాలలో భారీ సంఖ్యలో ఓట్లు పడతాయి. అంటే.. తన ఓట్లు కోసం ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత ఒక్క జగన్ రెడ్డికి మాత్రమే చెల్లుతుంది.

ఇక అమ్మ ఒడి కార్యక్రమం తనకు గొప్ప ఉపయోగంగా ఉంటుంది అనేది జగన్ రెడ్డి అభిప్రాయం. లబ్ధిదారుల ఖాతాల్లోకి బటన్లు నొక్కి డబ్బులు వేస్తున్నా అంటూ జగన్ రెడ్డి తనను తాను బాగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. దీనివల్ల పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. అభివృద్ధి లేదు. పిల్లలకు సరైన విద్య అందడం లేదు. ఎవరు ఎంత విమర్శించిన జగన్ రెడ్డి తన బటన్ల సంక్షేమ కార్యక్రమాలను మాత్రం ఆపడం లేదు. అలాగే చిత్తశుద్ధితో అవినీతి చేసుకుంటూ పోతున్నాడు.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనుక్కోవడానికి ఇప్పటి నుంచే జగన్ రెడ్డి భారీ మొత్తంలో డబ్బు పోగేస్తున్నాడు. అందుకోసం భూగర్భ గనుల తవ్వకాలు యదేచ్చగా జరిగిపోతున్నాయి. మధ్య నిషేధం అని చెప్పి.. ప్రస్తుతం ఆంధ్రాలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. కారణం జగన్ రెడ్డికి డబ్బు కావాలి. తన డబ్బు కోసం సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు జగన్ రెడ్డి. అన్నట్టు ఇక్కడ ఓ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టీటీడీ వారి సౌందర్య ఉత్పత్తులు అంటూ జగన్ రెడ్డి ఆ రకంగానూ డబ్బులు కాజేస్తున్నాడు.

ఎలాగూ ఎన్నికలప్పుడు ఎవరికి అనుమానం రాకుండా డబ్బులు పంచడానికి తనకు వాలంటీర్లు ఉన్నారు. అది జగన్ రెడ్డి ధీమా. మరి ప్రతిపక్ష నాయకులకు ఎవరు ఉన్నారు ?, ప్రజలకు ఎవరు ఉన్నారు ?. కాబట్టి.. జగన్ రెడ్డి పీడ వదిలించుకోవడం అంత తేలిక కాదు. కానీ ఆంధ్ర రాష్ట్రం బతకాలి అంటే.. ప్రజలకు పోరాటం తప్పదు.

CLICK HERE!! For the aha Latest Updates