
Sankranthiki Vastunnam heroines:
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన Sankranthiki Vastunnam సినిమా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన పొందుతోంది. వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రవిపూడి దర్శకత్వం వహించారు. మంచి పాజిటివ్ టాక్‌తో సినిమా మొదటి రోజే ఆకట్టుకోవడంతో పాటు భారీ కలెక్షన్లను సాధించింది.
వెంకటేష్ నటన పట్ల అందరూ మెచ్చుకుంటున్నా, సినిమాకు హైలైట్ అయిన పాత్ర మాత్రం అశ్వర్యా రాజేష్ పోషించిన భగ్యలక్ష్మి పాత్ర. ఈ పాత్రలో ఆమె శక్తివంతమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. భగ్యలక్ష్మి పాత్రలో ఆమె చేసిన ఎమోషనల్ సీన్స్ అందరినీ కదిలించాయి.
సినిమా ప్రమోషన్ల సమయంలో అశ్వర్యా మాట్లాడుతూ ఈ పాత్రను కొందరు హీరోయిన్లు తిరస్కరించారని వెల్లడించారు. “మొదట 2-3 హీరోయిన్లు ఈ పాత్రను రిజెక్ట్ చేశారని, అది తల్లిపాత్ర కాబట్టి చేసేందుకు ఇష్టపడలేదని అనిల్ చెప్పారు” అని అశ్వర్యా పేర్కొన్నారు.
సినిమా చూసిన తర్వాత నెటిజన్లు ఆ హీరోయిన్ల పేర్ల గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే భగ్యలక్ష్మి పాత్ర సినిమాకే వెన్నెముకలా నిలిచింది. ఏ హీరోయిన్ అయినా ఈ పాత్ర చేసినా, అది ఆమె కెరీర్‌లో కీలక మలుపు అయ్యేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయంలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. “ఆ హీరోయిన్‌లు ఎవరు? తాము ఇంత మంచి అవకాశాన్ని కోల్పోయిన విషయాన్ని తెలుసుకొని పశ్చాత్తాపపడతారా?” అని నెటిజన్లు కుతూహలంగా ఉన్నారు. అనిల్ రవిపూడి త్వరలోనే ఆ పేర్లను చెప్పవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.