HomeTelugu Trending'నా సామిరంగ' థీమ్‌ సాంగ్‌

‘నా సామిరంగ’ థీమ్‌ సాంగ్‌

Whistle Theme Song from Naa

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి విజిల్ థీమ్ సాంగ్ రిలీజైంది. దేవుడే తన చేతితో రాసిన. ఒక కావ్యం అంజిది, కిష్టయ్యది విడదీయని ఒక బంధం… అంటూ సాగే ఈ గీతం నా సామిరంగ చిత్రంలో నాగార్జున, అల్లరి నరేశ్ ల మధ్య స్నేహానుబంధాన్ని చాటుతోంది.

ఎంఎం కీరవాణి ఈ పాటకు సంగీతం మరియు లిరిక్స్‌ అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న నా సామిరంగ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.

విడుదల తేదీ దగ్గర పడుతుంది.. అయినప్పటికీ ఈ సినిమా షూటింగ్‌ ఇంకా జరుగుతునే ఉంది. అయితే ఈ క్రమంలో ఈ మూవీ ఏమైనా వాయిదా పడే అవకాశం ఉందోమో అనే టాక్‌ మొదలైంది. అయితే నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ తదితరులు నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu