
Rashtrapati Bhavan Wedding:
భారత దేశ చరిత్రలో తొలిసారిగా Rashtrapati Bhavan లో ఓ పెళ్లి జరగబోతోంది. సాధారణంగా, ఈ ప్రదేశం విదేశీ అతిథులను ఆహ్వానించడానికి, అధికారిక కార్యక్రమాల కోసం ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు ఓ విశేష సందర్భానికి వేదిక కానుంది.
CRPF అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా ఈ అరుదైన అవకాశాన్ని పొందిన వ్యక్తి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమె సేవల పట్ల ఎంతో ఆకర్షితురాలై, ఈ ప్రత్యేక అనుమతిని ఇచ్చారని తెలుస్తోంది.
పెళ్లి వివరాలు:
తేదీ: ఫిబ్రవరి 12, 2025
వేదిక: మదర్ తెరేసా క్రౌన్ కాంప్లెక్స్, రాష్ట్రపతి భవన్
వరుడు: అవనీష్ కుమార్, CRPF అసిస్టెంట్ కమాండెంట్, జమ్ము & కాశ్మీర్ లో పోస్టింగ్
వధువు: పూనమ్ గుప్తా, CRPF అసిస్టెంట్ కమాండెంట్, రాష్ట్రపతి భవన్‌లో PSO
ఈ పెళ్లి చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. భద్రత కారణంగా అతిథుల సంఖ్య పరిమితం చేయబడింది. రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి జరగడం ఇదే తొలిసారి, అందుకే ఈ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పూనమ్ గుప్తా రాష్ట్రపతి భద్రతా బృందంలో చాలా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె విధిపట్ల నిబద్ధత, క్రమశిక్షణను చూసి రాష్ట్రపతి ముర్ము ఎంతో మెచ్చుకున్నారు. అందుకే ఈ పెళ్లిని రాష్ట్రపతి భవన్‌లో జరపడానికి అనుమతి ఇచ్చారు.
ఈ సంఘటన భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి. రాష్ట్రపతి భవన్‌లో తొలిసారి పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో, ఇది ఎలాంటి ఘనంగా జరుగుతుందో చూడాలి!