HomeTelugu Big Storiesకారు జోరా.. కూటమి హోరా.. తెలంగాణలో గెలుపెవరిది?

కారు జోరా.. కూటమి హోరా.. తెలంగాణలో గెలుపెవరిది?

తెలంగాణలో ఓట్ల సమరం పూర్తయింది. ఇక ఫలితాల కోసం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 73 శాతం పోలింగ్ నమోదైంది. గత (2014) ఎన్నికల్లో 68.5 శాతం ఓటింగ్‌తో పోలిస్తే రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలోనే ఇంతటి పోలింగ్ జరగలేదట. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పోలింగ్ నమోదైంది. 4 నియోజకవర్గాల్లో 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం తగ్గింది. పట్టణం నుంచి ప్రజలు ఓటేసేందుకు పల్లెబాట పట్టారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్‌లు ప్రయాణికులతో కిక్కిరిసింది. పండగ వాతావరణం నెలకొంది.

6 7

హైదరాబాద్‌లోని కొత్తపేటకు చెందిన 104 ఏళ్ల బామ్మ తమ కుటుంబ సభ్యుల సహయంతో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ఉత్సాహ భరితంగా సాగింది. పాతబస్తీలో రిగ్గింగ్ జరగకపోవడం పోలింగ్ శాతం తగ్గడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. కొత్తగా ఓటు హక్కు పొందిన నవ యువకుల నుంచి పండు వృద్ధుల వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు.సాధారణంగా పోలింగ్ శాతం పెరిగిందంటే అది ప్రతిపక్షానికి అనుకూలంగా భావిస్తారు. గతంలో అనేక ఎన్నికలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో భారీ పోలింగ్ మేము తలపెట్టిన సంక్షేమ కార్యక్రమాలేనని అది మాకే కలిసొస్తుందని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. ఈసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 2 కోట్లను దాటుతుందని అంచనా. ఈ సారి చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.

ఏది ఏమైనా నేతల భవితవ్యం తెలియాలంటే, ఎవరు హంగ్, ఎవరు కింగ్ తెలియాలంటే 11వ తేదీ వరకు ఆగాల్సిందే. పోలింగ్ పూర్తయింది కానీ సస్పెన్స్ మిగిలే ఉంది. పోరు ముగిసినా ఉత్కంఠ మిగిలే ఉంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు కూటమి కట్టాయి. ఓ వైపు కేసీఆర్ మరో వైపు ప్రతిపక్షాల కూటమి మధ్యే రసవత్తర పోరు సాగింది.

మరోవైపు జాతీయ ఛానెళ్లు నిన్న ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. జాతీయ ఛానళ్లు టీఆర్‌ఎస్ వైపు మొగ్గుచూపించాయి. లగడపాటి సర్వే మాత్రం తెలంగాణలో ప్రజా కూటమి గెలిచే అవకాశముందని చెబుతోంది. కొన్ని అంచనాలు హంగ్ అసెంబ్లీని సూచిస్తున్నాయి. హంగ్ ఎవరు, కింగ్ ఎవరో 11న తెలియబోతుంది. మంగళవారం ఉదయం 10 గంటల లోపు ఓ అంచనాకు వచ్చే అవకాశముంది.

రాబోయేది ప్రజా కూటమి సర్కారేనని, హంగ్ వచ్చే సమస్యే లేదని, మెజారిటీ స్థానాలు సాధించి తీరుతామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ అధికారం తమదేనని, మూడింట రెండొంతుల స్థానాలు గెలుస్తామని, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్ నేతలతో భేటీలో కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కారు గేరు మారి మరింత జోరందుకుందా? చేతులు కలిపిన ప్రతిపక్షాలు ముందుకొస్తాయా? సైకిల్‌తో చేయి కలిపిన హస్తం కారుకు బ్రేక్‌ వేస్తుందా? పోలింగ్ ముగిశాక కూడా మిగిలిన శేష ప్రశ్నలివి. ఎన్నికల విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికల్లో ఓటరు నాడి అందక.. పార్టీల నేతలు సైతం ఉక్కిరి, బిక్కిరి అవుతున్నారు.

ఎగ్జిట్ పోల్స్ తీరు ఉత్కంఠను మరింత పెంచాయి. జాతీయ ఛానెల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌దే గెలుపని చెబుతుంటే, ప్రజాకూటమి గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి సర్వే చెబుతోంది. దీంతో అటు ఇటుగా హంగ్‌ ఏర్పడే అవకాశముందని మరికొందరు భావిస్తున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగిసినా టెన్షన్ మాత్రం అలాగే ఉంది. 11న వెలువడే ఫలితం కోసం యావత్ భారత దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

6a

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu